మూడవ మార్గం పుస్తకం ముఖచిత్రం
ఇప్పుడు అందుబాటులో

మూడవ మార్గం

ఎప్పుడూ మూడు మార్గాలు ఉన్నాయి, రెండు కాదు. మిషనరీ సంస్థ. పూర్తికాల పరిచారకులు సేవ చేసే స్థానిక సంఘం. మరియు సామాన్య విశ్వాసులు, వారు ఇప్పటికే జీవిస్తున్న చోట, వారి ఎదుట ఇప్పటికే ఉన్న ప్రజల మధ్య. మొదటి రెండూ దేవుని వరం, ఇప్పటికీ ఫలిస్తున్నాయి. మూడవది అన్నిటికన్నా పాతది, మనం మౌనంగా మర్చిపోయినది.

కొత్త ఆలోచన కాదు. మర్చిపోయిన ఆలోచన.

ఆన్‌లైన్‌లో చదవండి పుస్తకం డౌన్‌లోడ్ చేసుకోండి

మనం వెంబడిస్తున్నది ఒక వ్యూహాన్ని కాదు, ఆయననే.

ఇది ఏమిటి

సామాన్య శిష్యుల మూవ్‌మెంట్

గాస్పెల్ మూవ్‌మెంట్ అంటే, సామాన్య శిష్యులు దేవుని స్వరం విని, ఆయనకు లోబడి, ఇతరులూ అలా చేయడానికి సహాయపడడం. అదే మామూలు క్రైస్తవ జీవితం అయ్యేవరకు.

దీనికి పట్టా అక్కర్లేదు, హోదా అక్కర్లేదు, ఎవరి అనుమతీ అక్కర్లేదు.

సామాన్య శిష్యులు

యేసును ప్రేమించే ప్రతి మామూలు విశ్వాసి.

దేవుని స్వరం వినడం

ప్రతి ఒక్కరూ ప్రభువు స్వరాన్ని వినగలరు.

దేవునికి లోబడడం

విన్నదానికి లోబడడం.

ఇతరులకు సహాయపడడం

ఇతరులూ అలా చేయడానికి సహాయపడడం.

ఇప్పుడు అందుబాటులో · సామాన్య శిష్యుడి కోసం

మొదటి పుస్తకం

ఇది పుల్పిట్ కోసం రాసినది కాదు. ఒక రైతు కోసం, ఒక అమ్మ కోసం, ఒక దుకాణదారుడి కోసం, ఏ వేదాంత కళాశాలా చూడని ఒక సామాన్య విశ్వాసి కోసం. నాయకుడైనా, కొత్తవాడైనా, అందరూ మొదలుపెట్టేది ఇక్కడే.

తయారవుతోంది · నడిపించడం నేర్చుకుంటున్నవారి కోసం

రెండో పుస్తకం

ఏళ్ల తరబడి ఈ పనిలో ఉండి, లోబడడం ఒకప్పుడు ఎంత సింపుల్‌గా ఉండేదో మరచిపోయిన మూవ్‌మెంట్ నాయకుల కోసం. ఇది నేర్చుకోవడానికి ఇంకొక పెద్ద వ్యవస్థను మీ నెత్తిన పెట్టదు, సింపుల్‌తనాన్నే తిరిగి మీ చేతికి ఇస్తుంది.

నాయకుల మాటలు

నాయకులు ఏమంటున్నారు

“ఇది మనకు కొత్తది కాదు, మనం మరిచిపోయినది.”

మన సహోదరీలు తమను తాము చిన్నగా చూసుకోవడం నేను ఏళ్లుగా చూస్తున్నాను. ప్రభువు మాత్రం మన హోదాను చూడలేదు, మన మనసును చూశాడు. సహోదరీలారా, దీన్ని చదివి పక్కన పెట్టకండి. మీ మనసులోకి వచ్చే ఆ ఒక్క పేరుతో మొదలుపెట్టండి.

డా. మేరీ ఎలిజబెత్ తాతపూడిడైమండ్స్ డాటర్స్
“మా సంఘంలో గ్రూప్‌లు మొదలయ్యాక, సభ్యులు ఆదివారం నా దగ్గరికి ప్రశ్నలతో వస్తున్నారు.”

మొదట నాకు కొంచెం సందేహమే ఉండేది. సభ్యులు తమంతట తామే వాక్యం చదువుకుంటే బోధ చిన్నదవుతుందేమో అనుకున్నాను. అలా జరగలేదు. ఇప్పుడు నా బోధకు ఆకలితో వచ్చేవాళ్లు ఎక్కువయ్యారు. ముందు మీరు చదవండి, తర్వాత రెండు మూడు కుటుంబాలకు ఇవ్వండి.

పాస్టర్ నెరుసుల కరుణాకర్కవనెంట్ చర్చ్
“దేవుడు మీ ప్రజల్లోనే మీ మనుషులను దాచి ఉంచాడు. మేము అడుగుపెట్టని ఊళ్లలో పైరు పెరుగుతోంది.”
సిమోన దర్శనిఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జీసీఏ
“మనం పాడించేది కొన్ని గంటలే, వాళ్లు జీవించేది వారమంతా.”
ప్రేమ్ బెజ్జలవర్షిప్ లీడర్

ఇంకా కొందరు చదువుతున్నారు. అందిన కొద్దీ ఇక్కడ చేరుస్తాం.

పాఠకుల మాటలు

మూడవ మార్గం, జీవితంలో

నాయకుల మాటలు పైన చదివారు. ఇక్కడ ఉన్నది దాన్ని జీవిస్తున్న సామాన్య శిష్యుల మాట. అసలు సంగతి అదే.

“మొదట్లో మా ఇంట్లో ఎవరూ యేసును ఎరుగరు, నేను బైబిల్ కూడా ఎప్పుడూ తెరిచి చూడలేదు. ఒకరు పిలిస్తే, ఒక చిన్న గ్రూప్‌లో కూర్చొని చూస్తూ ఉన్నాను, అంతే. ఇప్పుడు మా ఇద్దరి మధ్య నాలుగు గ్రూప్‌లు నడుస్తున్నాయి. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, అంతా ఆయన దయే.”

అనిల్ · పెట్రోల్ బంకు క్యాషియర్

పుస్తకం మొత్తం, మీ కోసం

మూడవ మార్గం పూర్తి పుస్తకం, తెలుగులో.

వాట్సాప్‌లో ఉచితంగా పొందండి

ఇతరులకు అందించండి

ఇది చదవాల్సినవాళ్లు మీకు తెలుసా?

వాట్సాప్ ఫేస్‌బుక్ ఈమెయిల్
మీ వంతు

మీ అనుభవం చెప్పండి

మీరు ఇప్పుడు ఉన్న చోటే యేసును వెంబడించే తీరును ఈ పుస్తకం మార్చిందా? మాకు రాయండి. మీ అనుమతితో ఆ మాటలను ఇక్కడా, రాబోయే ముద్రణల్లోనూ పంచుకోవచ్చు.

వాట్సాప్‌లో పంపండి

మీ పేరు, ఊరు, మీ అనుభవం రాసి పంపండి. మీ అనుమతి అడిగిన తర్వాతే ఇక్కడ చేరుస్తాం.

రచయిత

జేమ్స్ పాల్

జేమ్స్ పాల్ ఐదో తరం క్రైస్తవుడు. మూడు తరాలుగా వాళ్ల కుటుంబం ఈ పనినే చేస్తోంది. అమ్మలు, నాన్నలు, అన్నలు, చెల్లెళ్లు, పక్కింటివాళ్లు సువార్తను ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి అందించడం చూస్తూ పెరిగారు.

ముప్పై సంవత్సరాలుగా ఈ పనిలోనే ఉంటూ, అది కొద్ది కుటుంబాల నుంచి మొదలై ఊహించనన్ని ఇళ్లకూ పల్లెలకూ వ్యాపించడం కళ్లారా చూశారు. ఇందులో ఉన్నవి ఆయన చదివి తెలుసుకున్నవి కావు, తన సొంత ప్రజల మధ్య జీవించి చూసినవి.